![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -854 లో...... కావ్య దగ్గరికి రాజ్ వచ్చి ఇంటికి రమ్మని అడుగుతాడు. రానని కావ్య తెగేసి చెప్పడంతో.. ఈ విడాకుల పత్రాలపై సంతకం చెయ్యమని రాజ్ అనగానే అందరు షాక్ అవుతారు. కావ్య లోపలకి వెళ్తుంటే ఎక్కడికి అని రాజ్ అడుగుతాడు. సంతకం చెయ్యాలంటే పెన్ కావాలి కదా అని కావ్య లోపలికి వెళ్లి పెన్ తెస్తుంది.
ఆ తర్వాత విడాకుల పత్రాలపై కావ్య సంతకం చేస్తుంది. ఆ పేపర్స్ ని రాజ్ చింపేస్తాడు. నువ్వు రానిదే నేను ఇక్కడ నుండి వెళ్లనని ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తాడు రాజ్. మరొకవైపు ప్లాన్ సక్సెస్ అయి కావ్య, రాజ్ విడిపోతారని రుద్రాణి డ్యాన్స్ చేస్తుంది. అప్పుడే రాహుల్ వస్తాడు. ఇందిరాదేవి ఇంట్లో అందరిని పిలుస్తుంది. కావ్య కోసం రాజ్ ఇంటి ముందు ధర్నా చేసున్నాడట అని చెప్పగానే అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదేంటి నీ కొడుకు మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంటి ముందు అలా చేస్తున్నాడంటే హ్యాపీగా ఫీల్ అవుతావేంటని రుద్రాణి అంటుంది. నా కోడలు కోసమని అపర్ణ సమాధానం చెప్తుంది. ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పావ్.. ఇంట్లో స్వీట్ చేస్తానని అపర్ణ అంటుంది. ఆ తర్వాత అప్పు చాలా హ్యాపీగా ఉండి ఫ్రూట్స్ తింటుంది. కళ్యాణ్ వచ్చి తనతో మాట్లాడుతాడు.
మరొక వైపు కావ్య కావాలనే రాజ్ ముందు టీ తాగుతుంది. అప్పుడే ఒక తాగుబోతు వాడు వచ్చి.. నీకు సపోర్ట్ గా నేనుంటాను.. నేను భార్యాబాధితుడిని అని అతను అంటాడు. సపోర్ట్ గా మీడియా వాళ్ళని పిలుస్తానని పిలుస్తాడు. మీడియా వాళ్ళు వచ్చి మీరు ఇలా ఎందుకు ధర్నా చేస్తున్నారంటు అడుగుతారు. తరువాయి భాగంలో అందరూ పడుకున్నాక రాజ్ కోసం తన తండ్రి కృష్ణమూర్తితో భోజనం పంపిస్తుంది కావ్య. అది తీసుకొని రాజ్ భోజనం చేస్తాడు. నా కూతురిపై అంత ప్రేమ ఉంది.. అసలు కారణం ఏంటో చెప్పొచ్చు కదా అని కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |